నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షం
NGKL: నాగర్‌కర్నూల్‌లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి మరిన్ని చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.