UPDATE: ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

UPDATE: ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

PLD: నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. ఈ ఘటనలో తల్లి శంకర్ కుమారి(30), మూడేళ్ల చిన్నారి మౌనిక మృతి చెందగా, భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. మత్తు ఇంజక్షన్లు వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.