అంతర్జాతీయ కరాటే విజేతను అభినందించిన మంత్రి
W.G: కొలంబోలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన విస్సాకోడేరు విద్యార్థి కౌరు అభిలాష్‌ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన అభిలాష్ ప్రతిభను మంత్రి కొనియాడారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.