VIDEO: ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణం కూల్చివేత
MNCL: బెల్లంపల్లిలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. షంషీర్ నగర్ ఉర్దూ పాఠశాల ఎదురుగా ప్రభుత్వ డంపింగ్ యార్డ్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారు. కాలనీవాసులు, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అన్వర్ ఖాన్ ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.