VIDEO: కిలిమంజారో యాత్రకు భరత్.. సహకారం కోరుతూ విజ్ఞప్తి
WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట చెందిన యువ పర్వతారోహకుడు గడ్డం భరత్ ఇప్పటికే కాంగ్టో పర్వతం, మౌంట్ కబ్రు డోమ్, మౌంట్ బందర్‌పూచ్ శిఖరాలను విజయవంతంగా అధిరోహించి ప్రతిభ చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భరత్‌కు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎండీ అనిల్ కుమార్ శనివారం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.