ఖమ్మం-భద్రాచలం రోడ్డులో లారీ దగ్ధం
KMM: ఖమ్మం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఒక లారీలో లింగాల గ్రామ సమీపంలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, సిబ్బంది వచ్చేలోపే స్థానికుల్లో కొందరు స్పందించి, మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. లారీలో ఏమున్నాయనే వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొన్నారు.