ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందని చెప్పారు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిమీ, పెదకూరపాడులో 40.2 మిమీ, చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వెల్లడించారు.