గజ్వేల్-చేగుంట రహదారిపై రైతుల రాస్తారోకో

గజ్వేల్-చేగుంట రహదారిపై రైతుల రాస్తారోకో

SDPT: తమ చెరువుకు నీళ్లు వదలడం లేదని ఆరోపిస్తూ లింగారెడ్డిపల్లి గ్రామస్థులు వీరనగర్ స్టేజీ వద్ద గజ్వేల్ చేగుంట రహదారిపై ఇవాళ రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాయపోల్ ఎస్సై మానస ఘటనాస్థలానికి చేరుకుని, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. SI హామీతో రైతులు ఆందోళన విరమించారు.