విస్నూర్ శివారులో కారు బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

విస్నూర్ శివారులో కారు బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామ శివారులో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో హరిత హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే రక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.