'ఆశయాలను అనుసరించినప్పుడే జ్యోతి బా పూలేకు నిజమైన నివాళి'
NRPT: సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయాలకు పాటుబడిన మహాత్మ జ్యోతిబాపూలేకు దండలు చేసి నివాళులర్పించడం కాదని, ఆయన ఆశయాలను పాటిస్తూ పాటింప చేస్తూ అనుసరించడమే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మఖ్తల్ క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.