'పోలీసు అక్క' కార్యక్రమానికి విశేష స్పందన: SP
ADB: పోలీసు అక్క కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లాలోని విధులు నిర్వర్తిస్తున్న 19 పోలీసు అక్క సిబ్బంది, షీ టీం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల వేధింపులు జరగకుండా పోలీసు అక్క, షీ టీం బృందాలు జిల్లాలో అందుబాటులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.