24 ఏళ్ల తర్వాత నేరం రుజువు.. వ్యక్తికి జైలు శిక్ష

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న ధనేకుల తిరుపతయ్య అనే ఓ షాపుకు వెళ్లాడు. అక్కడ కూల్డ్రింక్ తీసుకొని తాగాడు. అనంతరం షాపులో ఉన్న బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా 24 ఏళ్ల తర్వాత నేరం రుజువు కావడంతో ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమాన విధిస్తూ నిన్న తీర్పు ఇచ్చింది.