VIDEO: మృతదేహాన్ని మంచంపై మోసుకెళ్లిన గ్రామస్తులు
PPM: జియ్యమ్మవలస మండలం చాపరాయిగూడ గ్రామానికి చెందిన మల్లేష్ అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో పిటిమండ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి గ్రామానికి మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.