గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందజేత
NLR: బుచ్చిరెడ్డిపాళెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి పద్మజ, టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి, కోదండరామస్వామి ఆలయ వ్యవస్థాపక దొడ్ల మురళీకృష్ణ పాల్గొని గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణీలు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.