పిడిశీలలో వివాహిత ఆత్మహత్య

VZM: గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు బుధవారం మధ్యాహ్నం తెలిపారు. గ్రామానికి చెందిన కర్రోతు సాయిసుధ (29) భర్త పనికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.