కొబ్బరి మొక్కలు పంపిణీ చేసిన ఏఎంసీ అధ్యక్షురాలు

SKLM: నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో ఏఎంసీ అధ్యక్షురాలు పాగోటి ఉమామహేశ్వరి ఆదివారం తన కుమారుని వివాహ పనులు ప్రారంభం సందర్భంగా 600 కొబ్బరి మొక్కలను తన భర్త విశ్రాంత ఉపాధ్యాయుడు అప్పల నాయుడుతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నరసన్నపేట నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన కూడా పాల్గొన్నారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.