లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: MLA
JN: జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్ధన్నపేట MLA KR నాగరాజు హాజరై, పద్మశ్రీ గడ్డం సమ్మయ్యను, లయన్స్ సభ్యులను సత్కరించారు. కరోనా సమయంలో లయన్స్ చేసిన సేవలు అనేక ప్రాణాలను కాపాడాయని MLA నాగరాజు కొనియాడారు.