వీధి దీపాలు మరమ్మత్తులు
SKLM: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీలో సోమవారం వీధిలైట్లకు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ హరికృష్ణ మాట్లాడుతూ.. మరమ్మత్తు గురైన వీధి దీపాలు మార్చి, నూతన బల్బులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మాన్ సంతోష్, విద్యుత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.