మత్తుకు దూరం.. క్రీడలకు చేరువగా
నిజామాబాద్ పోలీసులు యువతలో మత్తు వదిలించడానికి ముందుకు కదులుతున్నారు. మైదానంలో ఎక్కువ సమయం కేటాయించేలా ఆయా ఠాణాల పరిధిల్లో ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. మహమ్మారి జోలికి వెళ్లకుండా క్రీడలపై ఆసక్తి పెరిగేలా చైతన్యపరుస్తున్నారు. సీపీ చైతన్య మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృడత్వానికే కాకుండా మానసికంగా, నైతికంగా తీర్చిదిద్దే సాధనమని పేర్కొన్నారు.