మంత్రి లోకేష్‌తో ఒంగోలు ఎంపీ భేటీ

మంత్రి లోకేష్‌తో  ఒంగోలు ఎంపీ భేటీ

ప్రకాశం: ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. మంత్రి లోకేశ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి పలు విషయాలపై దిశానిర్దేశం చేస్తూ సూచనలు, సలహాలు అందించారు.