మహిళలను వేధిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ
MBNR: పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే ఈ నెంబర్ 8712659365 కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.