ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు స్వీకరించిన స్పీకర్
HYD: ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణకు స్వీకరించారు. ఈ నెల 6 నుంచి MLAల అనర్హత పిటిషన్లపై విచారించనున్నారు. 6న భద్రాచలం MLA తెల్లం వెంకట్రావ్, జగిత్యాల MLA సంజయ్ కుమార్‌ను విచారించనున్నారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీల పిటిషన్లపై విచారించనున్నారు. అలాగే ఈ నెల 12న మరోసారి తెల్లం వెంకట్రావ్, సంజయ్‌ల పిటిషన్లపై స్పీకర్ విచారించనున్నారు.