రికార్డు ధరకు టేకులపల్లి సంత.. రూ. 13 లక్షలకు సొంతం
BDK: టేకులపల్లి మండలం కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే సంత వేలం పాట రికార్డు ధర పలికింది. సోమవారం గోల్య తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో టేకులపల్లి, గోల్యతండా ఉమ్మడి గ్రామ పంచాయతీల సంత వేలంపాటను ఎంపీఓ జక్కుల గణేష్ గాంధీ, టేకులపల్లి సర్పంచ్ బాలు నాయక్, గోల్య తండా సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంత వేలంపాటలో రూ.13 లక్షల 50 వేలకు మూడ వాసు సొంతం చేసుకున్నట్లు ఎంపీఓ తెలిపారు.