VIDEO: నగరంలో బీసీ సంఘాల రాస్తారోకో
KNR: కరీంనగర్ తెలంగాణ చౌరస్తా వద్ద బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాయి ఈశ్వర చారి బలిదానానికి నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో బొల్లం లింగమూర్తి, దొంగిలి శ్రీధర్, శ్రీధర్ రాజు, కనుకయ్య గౌడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులు అదుపులోకి తీసుకున్నారు.