టర్నింగ్ ట్రాక్ కాదు.. డేంజరస్ పిచ్: అశ్విన్

టర్నింగ్ ట్రాక్ కాదు.. డేంజరస్ పిచ్: అశ్విన్

సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఓటమి నుంచి భారత్ తప్పకుండా పుంజుకుంటుందని మాజీ స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. అయితే, ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అశ్విన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ పిచ్ టర్నింగ్ ట్రాక్ కాదని అన్నాడు. సరిగ్గా తయారు చేయకపోవడం వల్ల ప్రమాదకరంగా మారిందని విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో బవుమా తప్ప మరే బ్యాటర్ అర్ధ సెంచరీ చేయకపోవడమే దానికి నిదర్శనమని చెప్పాడు.