స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

 ELR: జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని బస్సు చివర భాగంలో ఢీకొంది. ఈ ఘటనలో స్తంభం రెండు ముక్కలై విరిగిపోయింది. అయితే, బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.