ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
BDK: సుజాతానగర్ మండలం, మర్రితండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.