VIDEO: సొంత ఖర్చుతో బోరు బావి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపురం గ్రామంలో వెంకుగారి రాజిరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, ఎస్సీ కాలనీ వాసుల కోసం తన సొంత ఖర్చుతో బోరు బావిని తవ్వించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన చేసిన ఈ సేవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.