'నియోజకవర్గానికి డయాలసిస్ కేంద్రం మంజూరు'

'నియోజకవర్గానికి డయాలసిస్ కేంద్రం మంజూరు'

VZM: పీఎం నేషనల్ డయాలసిస్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం తెలిపారు. అందులో భాగంగా ఎస్.కోట నియోజకవర్గానికి ఒక కేంద్రాన్ని కేటాయించడం అభినందనీయమన్నారు. మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.