పాచిపెంటలో ఘనంగా డోలా యాత్ర

VZNR: పాచిపెంట మండల కేంద్రంలో వెలసిన శ్రీ త్రినాథస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఘనంగా డోలా యాత్రను నిర్వహించారు. స్వామివార్లకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన జాతరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అరుదైనా ఆలయం కావడంతో విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిస్సా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.