VIDEO: జాతరలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలి: ఎంపీ
HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఇవాళ ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురాతన ఆలయాల పరిరక్షణ అవసరమని, ఆలయాలు భారత సంస్కృతి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. జాతరలకు ప్రభుత్వాలు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించారు.