నేడు అండర్-19 బాలికల జిల్లా హాకీ జట్టు ఎంపికలు
NZB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా ఇవాళ ఆర్మూర్‌లో అండర్-19 జూనియర్ కళాశాలల బాలికల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి రమణ తెలిపారు. ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన జిల్లా జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఆసక్తి గలవారు 9848426821 ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.