నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
HYD: నగరంలో ఇవాళ హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ నుంచి తాడ్‌బంద్ వరకు 12 కి.మీ. మేర యాత్ర సాగుతుంది. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో 2 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా CTO, తాడ్‌బంద్, ఆనంద్ బాగ్, ECIL, తార్నాక, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.