అన్నా, చెల్లెళ్ల మధ్య పోటీకి వేదికగా స్థానిక సమరం!
MHBD: వినూత్న పరిణామాలకు వేదికగా స్థానిక ఎన్నికలు నిలుస్తున్నాయి. బయ్యారం మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలో అన్నాచెల్లెళ్లు ముఖాముఖి పోటీలో నిలవడం చర్చనీయాంశమైంది. బొర్ర కృష్ణకు కాంగ్రెస్, పొడుగు సుగుణకు బీఆర్ఎస్ మద్దతు లభించడంతో ఓటర్లు ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో సందిగ్ధంలో ఉన్నారు.