పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరూపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు 2 పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు ఉల్లెందుల రఘుపతికి చెందిన పాడి గేదెలు మృతి చెందాయి. వాటి విలువ దాదాపు ఒక్కొక్క గేద విలువ రూ. 70 వేలకు పైగా ఉంటుందని తెలిపారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.