తాటి చెట్టు నుంచి పడి వ్యక్తి మృతి
KRNL: ఆదోని మండలంలోని పెద్దతుంబలం గ్రామ శివారులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. హుస్సేనప్పా (35) తాటి చెట్టుపై తాటికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.