బాలుర వసతిగృహాల్లో ACB తనిఖీలు

బాలుర వసతిగృహాల్లో ACB తనిఖీలు

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని బీసీ బాలుర వసతిగృహాల్లో ACB అధికారులు తనిఖీలు నిర్వహించారు. వసతిగృహాల్లో అందుతున్న సౌకర్యాలు, రికార్డుల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ సోదాలు చేపట్టారు. విద్యార్థులకు పెడుతున్న భోజనం నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ACB అధికారులు హెచ్చరించారు.