మెహదీపట్నంలో ట్రాఫిక్ కష్టాలు

మెహదీపట్నంలో ట్రాఫిక్ కష్టాలు

HYD: మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లైఓవర్ కింద జరుగుతున్న పనుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనుల వల్ల తరచుగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ పనులు బ్రిడ్జి నిర్మాణానికే ప్రమాదకరమని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.