వయోవృద్ధుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
JN: మహిళా, శిశు, దివ్యాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇవాళ ఆవిష్కరించారు. నవంబర్ 12 నుంచి 19 వరకు వృద్ధుల ఆరోగ్యం, హక్కులు, అవగాహనపై వారం రోజుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.