'చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి'
విజయనగరం బాబామెట్టలోని కస్తూర్బా పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. 14 ఏళ్లలోపు బాల, బాలికలు తప్పనిసరిగా స్కూల్‌కి హాజరుకావాలన్నారు.