మట్టి గణపతులు ప్రతిష్ఠించడం అభినందనీయం: CI

NZB: పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించడం అభినందనీయమని CI శ్రీనివాస్ అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని 5వ టౌన్ పరిధిలో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. 9 ఏళ్లుగా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న భక్త హిందూ యూత్ నిర్వాహకుడు కల్ప చిరు రాజేందర్‌ను సన్మానించారు.