ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
MBNR: శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. రేపటి స్థానిక సంస్థల పోలింగ్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలను ప్రభావితం చేసే అంశాలు, గొడవలు చేయకూడదని.. అందరూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.