ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

SDPT: దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లమ్మ అమ్మవారి కటాక్షంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, ప్రజలందరూ ఆనందంగా జీవించాలన్నారు.