రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

CTR: రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రేపు పుంగనూరు పట్టణంలోని ZP అతిథి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు MVI సుప్రియ మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వైద్య శిబిరం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుందని చెప్పారు. కంటికి, ఇతర జబ్బులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. డ్రైవర్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.