'మార్చి 14న జాతీయ లోక్ అదాలత్'
PPM: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు.మార్చి 14న జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్, బ్యాంకు, కుటుంబ, ట్రాఫిక్ కేసులను ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.