రేపు పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ఆలయం మూసివేత
సత్యసాయి: నల్లచెరువు మండలం పాలపాటి దీన్నే ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం వల్ల మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహారాజు తెలిపారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం వల్ల గర్భగుడిని మూసివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.