జోనల్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జోనల్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభను కనబరచాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రెహమాన్, మండల విద్యాశాఖ అధికారి స్థానిక నాయకులు పాల్గొన్నారు.