మానవత్వం చాటుకున్న కలెక్టర్

మానవత్వం చాటుకున్న కలెక్టర్

VZM: కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చాడు. ఇది గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా అతని వద్దకు వెళ్లి దరఖాస్తును స్వీకరించారు. సమస్యను విన్న కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనకు వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.