ట్రాఫిక్ జామ్.. వాహనాదారులకు ఇబ్బందులు

ట్రాఫిక్ జామ్.. వాహనాదారులకు ఇబ్బందులు

TG: సంగారెడ్డి జిల్లా 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బీరంగూడ నుంచి లింగంపల్లి వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైవే విస్తరణ పనులు, వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు అక్కడ లేకపోవడం గమనార్హం.