'పెద్ది' పాట ఆలస్యం

'పెద్ది' పాట ఆలస్యం

రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం నుంచి ఈరోజు రాత్రి 7:02 గంటలకు రెండో పాట విడుదల కావాల్సి ఉంది. అయితే, చిన్న సాంకేతిక సమస్య కారణంగా విడుదల ఆలస్యమవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈరోజే ఖచ్చితంగా పాటను విడుదల చేస్తామని తెలియజేస్తూ.. అప్పటివరకు ఈ చిన్న క్లిప్‌ను చూడమంటూ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.